దశాబ్దాలుగా కలిసి కాపురం చేసిన తన భర్త ఓ వైపు మంటల్లో కాలిపోతూ ఉంటే, తాను మాత్రం తాపీగా టీవీ చూస్తూ గడిపిందో భార్య. అది కూడా పక్క గదిలోనే. ఈ ఘటన కోల్ కతాలోని మనిక్ తాలా గవర్నమెంట్ కాలనీలో కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, రంజిత్ కుమార్ బరాత్ (63), సుతపా బరాత్ (57)లు భార్యా భర్తలు. సీఈఎస్సీ అధికారిగా పదవీ విరమణ చేసిన రంజిత్, తన భార్యతో కలిసి ఇక్కడే ఉంటున్నాడు.
మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో వారి బెడ్ రూం గదిలో నుంచి దట్టమైన పొగలను చూసిన ఇరుగు, పొరుగు వారు పోలీసులకు, ఫైరింజన్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వెళ్లి తలుపులు బద్దలు కొట్టి చూసేసరికి భర్త ఓ గదిలో పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉండగా, మరో గదిలో లోపలివైపు నుంచి తలుపేసుకుని కూర్చుంది భార్య. తనను హత్య చేస్తాడన్న భయంతో గదిలో తలుపేసుకుని ఉన్నానని, గట్టిగా అరిచినా ఎవరూ రాలేదని ఆమె చెబుతుండగా, పోలీసులు మాత్రం ఈ ఘటన వెనుక పలు అనుమానాలు ఉన్నాయని చెబుతున్నారు. పోస్టుమార్టం తరువాతనే రంజిత్ మరణం ఎలా సంభవించిందన్న విషయాన్ని తేలుస్తామని తెలిపారు.
More Telugu News
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన
-
'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
-
ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!
-
సివిల్స్ కోచింగ్ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. ఆర్థిక సాయం పెంపు