అంతర్జాతీయ విమానాలు నిత్యం రాకపోకలు సాగించే దుబాయ్ ఎయిర్ పోర్టును గంటసేపు మూసేసిన ఘటన నేడు చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...దుబాయ్ ఎయిర్ పోర్టు మీదుగా ఓ అనధికార డ్రోన్ చక్కర్లు కొట్టడాన్ని ఎయిర్ పోర్ట్ అధికారులు గుర్తించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఎయిర్ పోర్టు అధికారులు ఉదయం 11.36 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు మూసేశారు. ఈ సందర్భంగా దుబాయ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ ద్వారా విమానాలకు సూచనలు చేసింది. కొన్ని విమానాలను గాల్లోనే చక్కర్లు కొట్టమని సూచించగా, మరికొన్ని అంతర్జాతీయ విమానాలను దారి మరల్చి దుబాయ్ సెంట్రల్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేసినట్టు అధికారులు తెలిపారు.
ప్రయాణికుల భద్రతే తమ ప్రధమ కర్తవ్యమని తెలిపిన అధికారులు, గత రెండేళ్లలో ఇలా జరగడం రెండోసారని, అంతరాయానికి చింతిస్తున్నామని తెలిపారు. విమానాశ్రయానికి ఐదు కిలోమీటర్ల రేడియస్ లో ప్రైవేటు కార్యకలాపాలు, మానవ రహిత వస్తువులు సంచరించేందుకు అనుమతి లేదని తెలిపారు. అనుమానాస్పదంగా ఏదైనా అనిపిస్తే...ప్రయాణికుల ప్రాణాలు కాపాడడమే తమ ప్రధమ కర్తవ్యమని వారు తెలిపారు.
More Telugu News
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన
-
'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
-
ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!
-
సివిల్స్ కోచింగ్ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. ఆర్థిక సాయం పెంపు