Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చెప్పులంటే ఫీలవుతున్నారు... చీపుర్లు చూపండి: జగన్

"చెప్పులతో కొట్టాలని అంటే తెలుగుదేశం నేతలు ఫీలవుతున్నారు. చెప్పుల బదులు చీపుర్లు చూపించండి. అప్పుడైనా సిగ్గొచ్చి హామీలు నెరవేరుస్తారేమో చూడాలి" అని వైకాపా అధినేత జగన్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం తీవ్ర ఉద్రిక్తత మధ్య అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్రను కొనసాగిస్తున్న ఆయన, ఒడిసి గ్రామంలో భారీ ఎత్తున హాజరైన ప్రజలను ఉద్దేశించి ఉత్సాహంగా ప్రసంగించారు. తెలుగుదేశం పార్టీ నేతలు తన పర్యటనను ఎంతగా అడ్డుకోవాలని చూస్తున్నా, ఆ ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతతో, ప్రజలు తమ బాధను పంచుకునేందుకు తరలివస్తున్నారని జగన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. కాగా, ఈ మధ్యాహ్నానికి అనంతపురం చేరుకునే జగన్, అక్కడ ఎస్పీ కార్యాలయం వద్ద జరిగే ధర్నా కార్యక్రమంలో పాల్గొననున్నారు.

More Telugu News