డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడితే.. విద్యార్థులకు వీసాలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు కట్!
డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడే విద్యార్థుల, నిరుద్యోగులపై హైదరాబాద్ పోలీసులు తీసుకురానున్న నిబంధనలు వారి ఉద్యోగాలు, విదేశీ ప్రయాణాలపై పడనుంది. డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన వారికి వీసా రద్దు చేయడం లేదా రాకుండా చేయడం వంటి కఠిన నిబంధనను తీసుకొస్తున్నామని హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్ లో కనుక పట్టుబడిన నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లయ్ చేస్తే వారి దరఖాస్తులను తిరస్కరించేలా నిబంధనలు తీసుకురానున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఒక నివేదికను రూపొందించి ప్రభుత్వానికి పంపనున్నామన్నారు.
డ్రంకెన్ డ్రైవ్ కేసులను నివారించడానికి ఈ నిబంధనలను తీసుకురానున్నామని మహేందర్ రెడ్డి చెప్పారు. కాగా, హైదరాబాద్ నగరంలో 2011 నుంచి ఇప్పటివరకూ దాదాపు 62 వేల డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. వాటిలో 30 వేల 78 కేసులు 18 సంవత్సరాల వయస్సు నుంచి 30 ఏళ్ల లోపు ఉన్న విద్యార్థులపైనే ఉన్నాయని సీపీ పేర్కొన్నారు.