భార్యను ఎలా కొట్టాలో చెబుతూ సౌదీ ఫ్యామిలీ థెరపిస్ట్ వీడియో!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భార్యను ఎలా కొట్టాలో చెబుతూ సౌదీ ఫ్యామిలీ థెరపిస్ట్ వీడియో!

సౌదీ అరేబియాలో ఫ్యామిలీ థెరపిస్టుగా పనిచేస్తున్న ఖలీద్ అల్ సఖాబీ అనే అతను, భార్యను ఎలా కొట్టాలో చెబుతూ తీసిన ఓ వీడియో హల్ చల్ చేస్తోంది. భార్యను కొట్టడం కాస్త కష్టమైన విషయమేనని, అయితే, కొట్టాల్సి వస్తే ఈ తరహా పద్ధతుల్లో దండించాలని చెబుతూ, కొన్ని నియమాలు వెల్లడించాడు. కోపంతో భార్యను కొట్టవద్దని, క్రమశిక్షణ పాటించి, కొట్టే సమయంలో ఇస్లాం నిబంధనలు పాటించాలని సూచించాడు. ఇనుపరాడ్లు, కర్రలను వాడకూడదని, పళ్లను తోముకునే పుల్లలు వంటవి, రుమాళ్లు వాడి దండించాలని అన్నాడు. చేస్తున్న పని తప్పని, తనకు కోపం వచ్చిందని తెలియజేయడమే ఉద్దేశంగా ఉండాలి తప్ప, హాని కలిగేలా హింసించరాదని ఇస్లాం బోధిస్తోందని తెలిపాడు. కొట్టే ముందు కారణం చెప్పాలని సఖాబీ వెల్లడించాడు. భార్య నిద్రపోతుంటే, దగ్గరకు వెళ్లవద్దని చెప్పాడు. కొంతమంది భార్యలు తాము భర్తతో సమానంగా ఉండాలని కోరుకుంటున్నందునే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, మరికొందరు కొట్టించుకోవాలని భర్తలను రెచ్చగొడుతుంటారని, కారణమేదైనా కొట్టాల్సి వస్తే, బయటకు తెలీకుండా కొట్టుకోవచ్చని సూచనలు, సలహాలు ఇచ్చాడు.

More Telugu News