Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భారత మార్కెట్లోకి వచ్చేసిన శాంసంగ్ సంచలన ఫోన్

కళ్లు చెదిరే ఫీచర్లతో కూడిన శాంసంగ్ సంచలన ఆవిష్కరణ గెలాక్సీ ఎస్4 మొబైల్ ఈ రోజు దేశీయ మార్కెట్లోకి విడుదల అయింది. దీని ధరను శాంసంగ్ 41,500 రూపాయలుగా నిర్ణయించింది. అంటే యాపిల్, హెచ్ టిసి ఒన్ ధరలకు సమానంగానే ఖరారు చేసినట్లయింది. ఈ రోజు నుంచీ దేశీయ మార్కెట్లో ఈ ఫోన్లు అందుబాటులో ఉంటాయని ఢిల్లీలో విడుదల సందర్భంగా కంపెనీ వెల్లడించింది. దీనిని నెల క్రితం అమెరికా మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఐదు అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే, సైగలు, కంటి చూపులతో పని చేసే అప్లికేషన్లు, వీడియో చూస్తూ చూస్తూ.. ఏదో అవసరం రీత్యా చూపు తిప్పుకున్న వెంటనే దానంతట అదే ఆగిపోయే వీడియో, సైగలతోనే కాలింగ్ ఇలా ఎన్నో అద్భుత ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇది ఐఫోన్5, హెచ్ టిసి ఒన్ కు తిరుగులేని పోటీ ఇవ్వగలదని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

More Telugu News