ఇకపై చిరునామా ధ్రువీకరణకు రేషన్ కార్డు చెల్లదన్న పాస్ పోర్టు కార్యాలయం
ఇకపై పాస్ పోర్టు పొందాలంటే, చిరునామా ధ్రువీకరణగా రేషన్ కార్డును అనుమతించరు. ఈ మేరకు విదేశీ వ్యవహారాల శాఖ నుంచి అన్ని రీజనల్ పాస్ పోర్టు కేంద్రాలకూ ఉత్తర్వులు అందాయి. ఏప్రిల్ 1 నుంచి ఈ నిర్ణయం అమలవుతుందని కేంద్రం వెల్లడించింది. రేషన్ కార్డులను సులభంగా ట్యాంపర్ చేసే అవకాశాలు ఉండటమే ఇందుకు కారణమని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. రేషన్ కార్డు స్థానంలో ఆధార్ కార్డు, ఐటీ అసెస్ మెంట్ ఆర్డర్, రిజిస్టర్ చేసిన రెంట్ అగ్రిమెంట్, ఫోటో అతికించబడ్డ బ్యాంకు పాస్ బుక్, జీవిత భాగస్వామి పాస్ పోర్టు తదితరాలను అనుమతిస్తామని వివరించారు. ఇదే విషయాన్ని విశాఖ పాస్పోర్టు ఆఫీసర్ ఎన్ఎల్పీ చౌదరి ఓ నోటిఫికేషన్ ద్వారా తెలియజేశారు.