ఎమ్మెల్యే రోజా నియోజకవర్గంలో సంబరాలు
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజాపై అసెంబ్లీ విధించిన ఏడాది సస్పెన్షన్ తీర్మానాన్ని ఎత్తివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో నగరి నియోజకవర్గ ప్రజలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టపాసులు కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. తమ నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించేందుకు తమ నాయకురాలు మళ్లీ అసెంబ్లీలో కనిపించనుందన్నారు.