'పల్సర్' ప్రియులకు బజాజ్ పండగ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'పల్సర్' ప్రియులకు బజాజ్ పండగ!

వేగంగా దూసుకెళ్లే బైకర్ల కోసం బజాజ్ సంస్థ 'పల్సర్ ఫెస్టివల్ ఆఫ్ స్పీడ్'ను ప్రకటించింది. మార్చి 20న ముంబైలో పోటీలు జరుగుతాయని, ఆపై హైదరాబాద్, ఢిల్లీ, పుణె, బెంగళూరు, చెన్నై నగరాల్లో పోటీలు ఉంటాయని తెలిపింది. 20వ తేదీన ముంబైలోని అనిక్ వాడాలా, భక్తి పార్క్ లింక్ రోడ్డులోని ఐమాక్స్ పార్కింగ్ ప్లేస్ లో పోటీ జరుగుతుందని, 200 సీసీ కన్నా అధిక ఇంజన్ సామర్థ్యమున్న పల్సర్ బైక్ లను నడుపుతున్న యువత పాల్గొనవచ్చని తెలిపింది. ఒక్కో నగరం నుంచి ఆరుగురిని ఎంపిక చేసి చెన్నై లోని మద్రాస్ మోటార్ రేస్ ట్రాక్ లో ఫైనల్ పోటీలను ఏప్రిల్ 16న జరుపుతామని తెలిపింది. ఫైనల్స్ కు ఎంపికైన వారందరికీ ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నామని, విజేతలకు నగదు బహుమతులు ఇవ్వనున్నామని తెలిపింది.

More Telugu News