తమిళనాట అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. రాష్ట్రంలో అధికారం నిలుపుకునేందుకు అన్నాడీఎంకే, కోల్పోయిన సీఎం పీఠాన్ని దక్కించుకునేందుకు డీఎంకే హోరాహోరీగా తలపడుతున్నాయి. ఎన్నికలకు కాస్తంత ముందుగానే ప్రచారానికి తెర తీసిన అన్నాడీఎంకే అధినేత్రి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత తనదైన శైలిలో కొత్త పథకాలను ప్రారంభిస్తూ దూసుకెళుతున్నారు.
ఇక విపక్ష డీఎంకే కూడా ఇప్పుడిప్పుడే ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ప్రచారం కోసం డీఎంకే అధినేత, మాజీ సీఎం కరుణానిధి కోసం ఓ ప్రత్యేక వాహనం కూడా రెడీ అయిపోయింది. ఈ క్రమంలో ప్రచారంలో సత్తా చాటేందుకు ఇరు పార్టీలు వ్యూహాలు రచించాయి. ఇందులో భాగంగా జన బలాన్ని చాటేందుకు రెండు పార్టీలు కూడా సరికొత్త పంథాను అమలు చేస్తున్నాయి.
‘ప్రజా సేకరణ పథకం’ పేరిట ప్రచారంలోకి వచ్చిన కొత్త పథకంలో భాగంగా ప్రచారానికి హాజరయ్యే వారికి పెద్ద ఎత్తున తాయిలాలు అందుతున్నాయి. ప్రచార సభకు హాజరై, రెండు గంటల పాటు కూర్చుని చప్పట్లు కొట్టే వారికి తలా రూ.500 ఇచ్చేందుకు పార్టీలు సిద్ధమయ్యాయి.
ఇక ఆయా పార్టీలు నిర్వహించే ర్యాలీల్లో పాలుపంచుకునేవారికి రూ.1,000 నోటు దక్కనుందట. ఇక ఇలా ఓ 25 మందిని తీసుకొచ్చే వారికి రోజుకు రూ.2,500 ఇచ్చేందుకు తమిళ పార్టీలు రంగం సిద్ధం చేశాయని సమాచారం. కొన్ని గంటల పాటు ఊరికే కూర్చోవడం, ర్యాలీలో కొంత దూరం నడిస్తేనే వందలాది రూపాయలు ఇస్తామంటుండటంతో అక్కడ ఇళ్లలో ఖాళీగా ఉండే మహిళలకు యమా గిరాకీ పెరిగిందట. ఇక కూలీ పనులకు వెళ్లే వారు కూడా పనులు మానేసి ప్రచారం బాట పడుతున్నారు.
More Telugu News
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ