హుసేన్ సాగర్ లో ప్రత్యక్షమైన ‘కాటమారన్ పాంటూన్’!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హుసేన్ సాగర్ లో ప్రత్యక్షమైన ‘కాటమారన్ పాంటూన్’!

కాటమారన్ పాంటూన్... అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన చిన్న బోటు. 12 సీట్లుండే దీని ఖరీదు దాదాపు రూ. 22 లక్షలు. ఇండియాలో మొట్టమొదటి కాటమారన్ పాంటూన్ హైదరాబాద్ లోని హుసేన్ సాగర్ లో పర్యాటకుల సేదదీర్చనుంది. ఖరీదైన సోఫాలు, అందమైన అలంకరణ, మ్యూజిక్ సిస్టమ్ తదితరాలతో ఉండే ఈ పడవలో ఓ రౌండ్ తిరిగి రావాలంటే, ఒక్కొక్కరికీ రూ. 100 చొప్పున చెల్లించాల్సి వుంటుంది. అన్నట్టు దీనిపై బుల్లి బుల్లి పార్టీలు కూడా చేసుకోవచ్చు. ఓ మూడు చిన్న కుటుంబాలు లేదా ఓ పెద్ద కుటుంబం బర్త్ డే పార్టీలు, మ్యారేజ్ డే తదితరాలు జరుపుకునేందుకూ ఈ బోటును గంటల ప్రాతిపదికన అద్దెకివ్వాలని నిర్ణయించినట్టు పర్యాటక శాఖ అధికారి ఒకరు తెలిపారు.

More Telugu News