హైదరాబాద్ యూనివర్శిటీలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల ఏమీ తెలియని చిన్నపిల్లాడేమీ కాదని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ వ్యాఖ్యానించడంపై జవహర్ లాల్ నెహ్రూ వర్శిటీ విద్యార్థులు మండిపడుతున్నారు. ఈ మేరకు స్మృతీ ఇరానీకి ఓ బహిరంగ లేఖను రాస్తూ, "పార్లమెంటులో మీరిచ్చిన ప్రసంగం నేను విన్నాను. ఇక్కడ మీకు ఒకటి స్పష్టం చేయాలని అనుకుంటున్నా. ఈ లేఖ ఓ చిన్న పిల్లాడి నుంచి తల్లిలాంటి మంత్రికి రాస్తున్నది కాదు. ఓ రాజకీయ వ్యక్తి, రాజకీయాల్లోనే ఉంటున్న మరొకరికి రాస్తున్నది. కేవలం విద్యార్హతల కారణంగానే వ్యక్తి గొప్పతనాన్ని లెక్కించలేమని కూడా నేను స్పష్టం చేయదలచుకున్నా. అసలు ఈ లెక్కే తప్పు" అని అనంత్ ప్రకాష్ అనే విద్యార్థి రాసిన లేఖ ఇప్పుడు వైరల్ అవుతోంది.
"మీరు ఓ మహిళనని చెప్పుకుంటూ మరో మహిళపై అభాండాలు మోపుతున్నారు. ఎన్నో తరాలుగా మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేశంలో, ఓ దళిత మహిళ తన పిల్లలను పెంచి పెద్ద చేసేందుకు ఎన్నో ఇబ్బందులు పడితే, ఇప్పుడు మీరు ఆమె పిల్లలకు తండ్రి కులాన్ని ఆపాదించాలని చూస్తున్నారు" అని ఆరోపించారు. సహజ న్యాయం గురించి మీకు తెలియదా? అని ప్రశ్నించిన ప్రకాష్, రోహిత్ తల్లి తనకు న్యాయం చేయాలని భిక్షాటన చేయడం లేదని, తనకు జరుగుతున్న అన్యాయం మరొకరికి జరగకూడదని మాత్రమే పోరాడుతున్నారని చెప్పారు.
More Telugu News
-
డ్రంకెన్ డ్రైవ్‌లో హల్చల్.. కానిస్టేబుల్‌ను కొరికిన ర్యాపిడో డ్రైవర్.. వీడియో వైరల్!
-
చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!
-
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?
-
ఏపీకి ‘అర్ణబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత
-
మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అదరగొట్టాడు.. అతనికి ఆ ఫార్మాట్లో కూడా అవకాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్
-
సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్లైన్లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు
-
సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ
-
యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!
-
టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన
-
ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం
-
ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయణ' మెలోడీ
-
ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్
-
పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక
-
టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు
-
తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి