Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

యుద్ధ రంగం నుంచి పారిపోతున్నారని... 20 మంది సొంత సభ్యుల తల నరికిన ఐఎస్

ఇస్లామిక్ రాజ్య స్థాపన కోసమంటూ రంగంలోకి దిగిన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదుల దారుణాలకు అంతు లేకుండా పోతోంది. చిన్న పిల్లలు, ఆడవాళ్లు అన్న తేడా లేకుండా షరియా చట్టాలను కఠినంగా అమలు చేయడమే కాక బందీలుగా చెరబట్టిన వారి కుత్తుకలు కోసి సదరు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఐఎస్ ఉగ్రవాదులు ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్నారు. తాజాగా ఆ సంస్థ ఉగ్రవాదులు మరింత దారుణానికి తెగబడ్డారు. తమ పిలుపునకు ఆకర్షితులై యుద్ధ రంగంలోకి దిగి, ఆ తర్వాత వారి అసలు నైజం తెలుసుకుని వారికి దూరంగా జరుగుతున్న మిలిటెంట్లను కూడా ఐఎస్ ఉగ్రవాదులు వదిలిపెట్టడం లేదు. ఇటీవల పరిణామాలతో భయాందోళనకు గురైన 20 మందికి పైగా ఐఎస్ మిలిటెంట్లు యుద్ధ రంగం నుంచి తప్పుకోవాలని భావించారు. ఇరాక్ పట్టణం మోసుల్ నుంచి తప్పించుకుని వెళుతున్న సదరు మిలిటెంట్లను ఐఎస్ ఉగ్రవాదులు పట్టణ చెక్ పోస్టుల వద్ద శుక్రవారం రాత్రి పట్టేశారు. యుద్ధం నుంచి వెళ్లిపోవడం తప్పేనని వారిని షరియా కోర్టు ముందు హాజరుపరిచారు. షరియా కోర్టు కూడా వారి పలాయనాన్ని తప్పుగానే తేల్చింది. మరణ శిక్ష విధించింది. దీంతో ఆ 20 మంది మిలిటెంట్ల తలలను బహిరంగంగా నరికేసిన ఐఎస్ ఉగ్రవాదులు సదరు వీడియోలను కూడా తమ అదికారిక వెబ్ సైట్లో అప్ లోడ్ చేశారు.

More Telugu News