గ్రేటర్ బరిలో 72 మంది నేరచరితులు... జాబితాలో ఎనిమిది మంది మహిళలు కూడా!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గ్రేటర్ బరిలో 72 మంది నేరచరితులు... జాబితాలో ఎనిమిది మంది మహిళలు కూడా!

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో నేరచరిత్ర కలిగిన అభ్యర్థుల జాబితా విడుదలైంది. 'ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్' సంస్థ విడుదల చేసిన ఈ జాబితాలో 72 మంది ఉన్నారు. అందులో టీడీపీ నుంచి 13, కాంగ్రెస్ -13, టీఆర్ఎస్-14, ఎంఐఎం-11, బీజేపీ-4, ఎంబీటీలో ఇద్దరు, సీపీఐ, సీపీఎం నుంచి ఒక్కొక్కరు, బీఎస్పీ ఒకరు, ఎస్పీ ఒకరు, ఇండిపెండెంట్స్-11 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇదే జాబితాలో ఎనిమిది మంది మహిళలు కూడా నేరచరితులుగా ఉండటం గమనార్హం.

More Telugu News