Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలుగు వాళ్లకి వెంకయ్యనాయుడి కితాబు

తెలుగువారు అన్నిరంగాల్లో దూసుకుపోతున్నారని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కితాబిచ్చారు. ఢిల్లీ ఆంధ్రా అసోసియేషన్ కేలండర్ ను ఆవిష్కరించిన అయన తమిళనాడులో తెలుగుపై ఆంక్షలు విధించడం శోచనీయమన్నారు. ఢిల్లీలోని ఆంధ్రా అసోసియేషన్ తెలుగువారిని ఏకం చేయడంలో ముందుంటుందన్నారు. అలాగే అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ తెలుగు భాష మరింత వ్యాప్తి చెందేందుకు పాటుపడుతుందన్నారు. ఏ రాష్ట్రంలో ఉన్నా సొంత భాషను నేర్చుకునే అవకాశం మనకు రాజ్యాంగం కల్పించిందన్నారు.

More Telugu News