పంజాబ్ లోని భారత రక్షణ శాఖకు చెందిన కీలక స్థావరం పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై నేటి తెల్లవారుజామున జరిగిన దాడికి ఉగ్రవాదులు భారీ ప్రణాళికనే రచించుకున్నట్లు తెలుస్తోంది. నిన్నటి నుంచి వరుసగా చోటుచేసుకున్న ఘటనలను విశ్లేషిస్తున్న భద్రతా దళాలు ఈ మేరకు ఉగ్రవాదుల విధ్వంసకర ప్లాన్ గుట్టు విప్పుతున్నాయి. రెండు రోజులకు ముందుగానే పాక్ సరిహద్దు జిల్లాలు పఠాన్ కోట్, గురుదాస్ పూర్ జిల్లాల్లోకి ఐదారుగురు ఉగ్రవాదులు చొరబడ్డట్టు తెలుస్తోంది. భారత భూభాగంలోకి ఎంటర్ కాగానే, భారత సైనిక దుస్తుల్లోకి మారిపోయిన ఉగ్రవాదులు అటు వైపుగా వచ్చిన గురుదాస్ పూర్ ఎస్పీ సల్వీందర్ సింగ్ ను కిడ్నాప్ చేశారు.
గురువారం రాత్రి తన జూనియర్ పోలీసు అధికారితో కలిసి పఠాన్ కోట్ లోని ఓ గురుద్వారాలో ప్రార్థన చేసేందుకు సల్వీందర్ సింగ్ వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో సైనిక దుస్తుల్లో రోడ్డుకు అడ్డంగా నిలబడ్డ ఉగ్రవాదులు ఆయన కారును అటకాయించారు. కారు ఆగీఆగగానే అందులోకి చొరబడ్డారు. ఓ ఉగ్రవాది డ్రైవర్ సీటును ఆక్రమించగా, ఎస్పీతో పాటు ఆయన జూనియర్ అధికారిని కూడా ఉగ్రవాదులు తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత వారిద్దరిని వదిలేసి కారుతో ముందుకు దూసుకెళ్లారు. అప్పటికీ కారులోనే ఉన్న సల్వీందర్ సింగ్ సహాయకుడిని గొంతు కోసిన ఉగ్రవాదులు వేగంగా వెళుతున్న కారు నుంచి కిందకు తోసేశారు. దీనిని గమనించిన స్థానికుల సమాచారంతో పోలీసులు బాధితుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ఇక పఠాన్ కోట్ కు 35 కిలో మీటర్ల దూరంలో ఎస్పీ కారును వదిలేసి అటుగా వచ్చిన మరో వ్యక్తి కారును అపహరించారు. ఈ క్రమంలో సదరు వ్యక్తిని ఉగ్రవాదులు చంపేశారు. ఆ తర్వాత సైనిక దుస్తుల్లోనే పఠాన్ కోట్ ఎయిర్ బేస్ కు చేరుకున్న ఉగ్రవాదులు అక్కడే మకాం వేసి అదను చూసి నేటి తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో మెరుపు దాడి చేశారు. అయితే రాత్రి సమయంలోనూ అప్రమత్తంగా ఉండే భారత సైన్యం ముందు పాక్ ఉగ్రవాదుల పప్పులు ఉడకలేదు. వేగంగా స్పందించిన భద్రతా దళాలు ఉగ్రవాదులపై విరుచుకుపడ్డాయి. ఇద్దరిని మట్టుబెట్టేశాయి. ఎయిర్ బేస్ పై దాడిలో ఐదారుగురు ఉగ్రవాదులు పాలుపంచుకుని ఉండొచ్చని తెలుస్తోంది. సమాచారం అందుకున్న సైనిక ఉన్నతాధికారులు మరింత మంది సైనికులను అక్కడికి తరలిస్తున్నారు.
More Telugu News
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు