కాలపరిమితి లేని డేటా వ్యాలిడిటీని ప్రకటించిన ఎయిర్ టెల్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాలపరిమితి లేని డేటా వ్యాలిడిటీని ప్రకటించిన ఎయిర్ టెల్!

ఢిల్లీ, ముంబయి పరిధిలోని ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం కాలపరిమితిలేని డేటా వ్యాలిడిటీ ఆఫర్లను భారత్ లో మొట్ట మొదటిసారిగా ఎయిర్ టెల్ సంస్థ ప్రకటించింది. 2జీ, 3జీ, 4జీ ఈ మూడు డేటా ప్లాన్లకు సంబంధించి కాలపరిమితిలేని డేటా వ్యాలిడిటీ ఆఫర్లు వర్తిస్తాయని ఎయిర్ టెల్ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఢిల్లీ పరిధిలోని వినియోగదారులకు ... 35 ఎంబీ ధర రూ.24, 75ఎంబీ ధర రూ.51, 110ఎంబీ ధర రూ.74 గా నిర్ణయించారు. ముంబయి పరిధిలోని వినియోగ దారులకు... 30 ఎంబీ ధర రూ.22, 80ఎంబీ ధర రూ.54,110 ఎంబీ ధర రూ.73గా నిర్ణయిం చారు. ఈ మూడు కొత్త ఆఫర్లు గురువారం నుంచి ఢిల్లీ, ముంబయి ప్రీపెయిడ్ వినియోగ దారులకు అందుబాటులోకి వచ్చినట్లు ‘ఎయిర్ టెల్’ ప్రతినిధులు వెల్లడించారు. వచ్చే సోమవారం నుంచి తెలుగు రాష్ట్రాలు సహా దేశ వ్యాప్తంగా ఉన్న తమ ప్రీపెయిడ్ వినియోగదారులకు ఈ ఆఫర్లు అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు.

More Telugu News