తిరుమల చేరుకున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తిరుమల చేరుకున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ

భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరుమల చేరుకున్నారు. ఈ ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా ఐ.భీమవరంలో వేద పాఠశాల భవన సముదాయానికి ప్రారంభోత్సవం చేసిన అనంతరం ఆయన తిరుపతి బయల్దేరారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో ప్రణబ్ తిరుమల చేరుకున్నారు. ఆయన వెంట గవర్నర్ నరసింహన్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఉన్నారు. కాసేపట్లో ఆయన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోనున్నారు.

More Telugu News