Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జమ్ము కశ్మీర్ లో కేబుల్ ఆధారిత వంతెన ప్రారంభం

జమ్ము కశ్మీర్ లోని బాసోహ్లీ వద్ద రావి నదిపై నిర్మితమైన కేబుల్ ఆధారిత వంతెనను రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ప్రారంభించారు. దీనిని జాతికి అంకితం చేస్తున్నట్టు చెప్పారు. ఇది ఉత్తరభారతంలో తొలి కేబుల్ ఆధారిత వంతెన. జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల రాకపోకలను ఈ వంతెన దగ్గర చేయనుంది. దాంతో ఈ రాష్ట్రాలు మరింత దగ్గరి సంబంధాలు కొనసాగించే అవకాశం ఉంది. వంతెన ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ సుహాగ్ పాల్గొన్నారు. ఈ వంతెన దునేరా-బాసోహ్లి-భదర్వా రోడ్డు మార్గంలో ఉంది. దీంతో కలిపి దేశవ్యాప్తంగా ఇలాంటి వంతెనలు నాలుగు ఉన్నాయి. కోల్ కతాలో హూగ్లీ నదిపైన, అలహాబాద్ లోని నైనీ వద్ద, ముంబయిలోని రాజీవ్ గాంధీ సీలింక్ వద్ద ఇలాంటి వంతెనలు వున్నాయి.

More Telugu News