‘కాల్ మనీ’ కొత్తదేం కాదు...ఇక అప్పు పుట్టేదెలా?: జేసీ ప్రభాకర్ రెడ్డి ఆసక్తికర కామెంట్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘కాల్ మనీ’ కొత్తదేం కాదు...ఇక అప్పు పుట్టేదెలా?: జేసీ ప్రభాకర్ రెడ్డి ఆసక్తికర కామెంట్

ఏపీలో దారుణాలకు తెర తీసిన కాల్ మనీ వ్యవహారంపై అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆసక్తికర కామెంట్ చేశారు. వడ్డీ వ్యాపారులపై చర్యలు తీసుకుంటే ప్రజలకు అప్పులు ఇచ్చేవారెవరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొద్దిసేపటి క్రితం అనంతపురంలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయినా కాల్ మనీ దందా ఈ రోజుది కాదని, ఎప్పటి నుంచో జరుగుతున్నదేనని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అన్ని పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలకు ఈ వ్యాపారాలతో సంబంధాలున్నాయని తెలిపారు.

More Telugu News