ఏపీలో నిర్మితమవుతున్న జాతీయ ప్రాజెక్టు పోలవరంపై ఒడిశా ఎంపీలు నిరసన గళం విప్పారు. ఉమ్మడి రాష్ట్రంలోనే పోలవరం ప్రాజెక్టు ప్రారంభమైంది. అయితే ఒడిశా ప్రభుత్వ అభ్యంతరం నేపథ్యంలో ఈ ప్రాజెక్టుపై వివాదాలు రేకెత్తాయి. ఓ సందర్భంలో ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అనుమతులు కూడా రాలేదు. అయితే ఒడిశా లేవనెత్తిన అభ్యంతరాలను పరిష్కరించిన నాటి ఉమ్మడి రాష్ట్ర సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాజెక్టుకు అనుమతులు సాధించారు. వైఎస్ అకాల మరణం తర్వాత ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. అంతేకాక వైఎస్ మరణానంతరం ఉవ్వెత్తున ఎగసిపడ్డ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో తెలంగాణ వాదులు కూడా ఈ ప్రాజెక్టును వ్యతిరేకించారు. తదనంతర కాలంలో రాష్ట్రం రెండుగా విడిపోయింది.
అయితే టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ప్రాజెక్టు నిర్మాణం వేగం పుంజుకుంది. దీంతో మళ్లీ ఒడిశా ఆందోళన వ్యక్తం చేసింది. నేటి పార్లమెంటు సమావేశాల్లో భాగంగా ఒడిశాకు చెందిన ఎంపీలు ప్లకార్డులు చేతబట్టి పార్లమెంటు ఆవరణలో నిరసన ప్రదర్శన చేపట్టారు. పోలవరం వల్ల తమకు నష్టం జరుగుతుందని ఆరోపించారు. తాము ప్రాజెక్టును వ్యతిరేకించడం లేదని, ప్రాజెక్టు ఎత్తును మాత్రం తగ్గించాలని వారు డిమాండ్ చేశారు.
More Telugu News
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు