మా ప్రభుత్వం వస్తే పూర్తి స్థాయిలో మద్య నిషేధం అమలు చేస్తాం: వైఎస్ జగన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మా ప్రభుత్వం వస్తే పూర్తి స్థాయిలో మద్య నిషేధం అమలు చేస్తాం: వైఎస్ జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజయవాడ పర్యటనలో భాగంగా కీలక ప్రకటన చేశారు. కృష్ణలంకలోని స్వర్ణ బార్ కల్తీ మద్యం ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించడంతో పాటు చికిత్స పొందుతున్న వారి పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పూర్తి స్థాయిలో మద్య నిషేధం అమలు చేస్తామని ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో మద్య నిషేధం అమలు చేయాలని కూడా ఆయన ఏపీ సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు. ఇందుకోసం అసెంబ్లీలో ప్రజల పక్షాన పోరాడతామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో చిన్న పిల్లలు సైతం మద్యానికి బానిసలవుతున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. కల్తీ మద్యం బాధిత కుటుంబాలకు రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

More Telugu News