తమిళనాడును వరదలు చుట్టుముట్టడం బాధాకరం: రాష్ట్రపతి
భారీ వర్షాలతో నీట మునిగిన తమిళనాడు పరిస్థితిపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. వరదలు చుట్టుముట్టడం బాధాకరమని అన్నారు. వరదల వల్ల పలువురు ప్రాణాలు కోల్పోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. తమిళనాడు ప్రజలు త్వరలోనే స్థైర్యంతో కోలుకుంటారని ఆశిస్తున్నానని ట్విట్టర్ లో పేర్కొన్నారు. చెన్నైలో భారీ వర్షాల వల్ల మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు.