ఐఎస్ తొలి మహిళా మానవ బాంబును కావాలనుంది: మిసెస్ టెర్రర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఐఎస్ తొలి మహిళా మానవ బాంబును కావాలనుంది: మిసెస్ టెర్రర్

బ్రిటీష్ మీడియా 'మిసెస్ టెర్రర్'గా పేర్కొనే సాలీ జోన్స్ తాను ఐఎస్ఐఎస్ తొలి మహిళా సూసైడ్ బాంబర్ కావాలని ఉందని పేర్కొంది. ఈ మేరకు సోషల్ మీడియాలో పేర్కొంది. సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగించే సాలీ జోన్స్ అమెరికాను హెచ్చరిస్తూ తరచూ పోస్ట్ చేస్తుంటుంది. ఐదేళ్ల క్రితం చెచెన్యాలో రష్యా దళాలపై ఆత్మాహుతి దాడి చేసిన హవా బరయెవ్ను జోన్స్ తరచుగా ప్రశంసిస్తూ ఉంటుంది. ఆమెను ఆదర్శంగా తీసుకున్న జోన్స్.. అమెరికా దళాలపై దాడి చేయాలనుకుంటున్నట్టుగా బ్రిటీష్ మీడియా వెల్లడించింది. కాగా, సాలీ జోన్స్ కోసం అమెరికా దళాలు వెంటాడుతున్నాయి. డ్రోన్ దాడుల్లో జోన్స్ను హతమార్చాలని లక్ష్యంగా చేసుకున్నాయి. ప్రపంచ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో సాలీ జోన్స్ కూడా ఉంది. సాలీ జోన్స్ గతంలో సిరియాకు పారిపోయి ఐఎస్ ఉగ్రవాదిని పెళ్లి చేసుకుంది. అమెరికా వైమానిక దాడిలో ఆమె భర్త హతమయ్యాడు. దీంతో, తాను సూసైడ్ బాంబర్ కావాలనుకుంటున్నానంటున్న సాలీ జోన్స్, అమెరికాకు చెమటలు పట్టిస్తోంది.

More Telugu News