ఉగ్రవాదంపై మోదీ 10 సూత్రాల పథకం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఉగ్రవాదంపై మోదీ 10 సూత్రాల పథకం

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ జీ-20 ముందు పది సూత్రాల పథకాన్ని ఉంచారు. మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు ఉగ్రవాదమేనని అన్న ఆయన, ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు వివిధ దేశాల్లో విస్తరిస్తుండటం మరింత ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ఐఎస్ఐఎస్ రిక్రూట్ మెంట్లు నిలిపివేయాలని, వారికి సాంకేతికత అందకుండా చూడాలని అన్నారు. వారికి ఇంటర్నెట్ కూడా లేకుండా చేయాలని అన్నారు. ఉగ్రవాదానికి, మతానికి సంబంధం లేదని, ఏ రూపంలో ఏ దేశంలో ఉన్నా ఉక్కుపాదంతో తుదముట్టించాల్సిందేనని మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదులకు నిధులందిస్తున్న వారిని నిలువరించాలని, ఇతర దేశాల నుంచి మద్దతు పలుకుతున్న వారిని అదుపు చేయాలని కూడా మోదీ సూచించారు. మోదీ చేసిన సూచనలను వెంటనే అమలు చేయాలని పలువురు జీ-20 నేతలు అభిప్రాయపడ్డారు.

More Telugu News