నిషేధిత బోడోల్యాండ్ ఉగ్రవాద సంస్థ నాయకుడు అరెస్ట్
నిషేధిత బోడోల్యాండ్ ఉగ్రవాద సంస్థ ఎన్డీఎఫ్ బీ నాయకుడు డింగాను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. బోడోల్యాండ్ ఉద్యమం బలహీనపడిన నేపథ్యంలో అసోం నుంచి పారిపోయిన అతను నెల రోజుగా కోజీకోడ్ లో ఉంటున్నాడు. ఈ క్రమంలో కేరళ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు నిఘావేసి నిర్ధారించుకున్న తరువాత డింగాను అదుపులోకి తీసుకున్నారు. అసోంలోని కోక్రాఘర్ జిల్లా బాలాపారా గ్రామానికి చెందిన డింగా ఎన్డీఎఫ్ బీకి నిర్వాహక కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. అతన్ని త్వరలో అసోం పోలీసులకు అప్పగించనున్నారు.