అవును మంత్రగాడిని కలిశాను, కానీ ఇప్పుడు కాదు!: నితీష్ కుమార్
తాను మాంత్రికుడిని కలిసిన మాట వాస్తవమేనని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చెప్పారు. ఈ ఘటన ఏడాదిన్నర క్రితం జరిగిందని వెల్లడించిన ఆయన, వీడియోను తీయించిన వ్యక్తిపై చర్యలు తప్పవని అన్నారు. బీజేపీ నీచ రాజకీయాల్లో భాగంగానే ఈ స్టింగ్ ఆపరేషన్ తనపై జరిపిందని విమర్శించారు. ఓ తాంత్రికుడు తనను కలవాలని కోరినట్టు ఓ సహచరుడు చెబితే, సరేనని చెప్పినట్టు ఆనాటి ఘటనను నితీష్ గుర్తు చేసుకున్నారు. తాను అతనిని కలిసి, ఆయన చెప్పింది విని వచ్చేశానని తెలిపారు. ఇదో చిన్న విషయమని అన్నారు. బీజేపీ నేతలు మంత్ర తంత్రాలకు దూరంగా ఉండేవారయితే, నిత్యమూ సాధువులను ఎందుకు కలుస్తారని ప్రశ్నించారు. మోదీ ఎవరిని కలుస్తున్నారన్న విషయమై తాను చెప్పక్కర్లేదని, సోషల్ మీడియా చూస్తే తెలిసిపోతుందని అన్నారు.