గుండు సుధారాణి పార్టీ వీడదనే భావిస్తున్నాం: ఎర్రబెల్లి
పార్టీ నాయకురాలు గుండు సుధారాణి టీఆర్ఎస్ లో చేరడం లేదని టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆమెకు ఎంపీ పదవి ఇచ్చి సముుచితంగా గౌరవించామని, పార్టీ మారదనే అనుకుంటున్నామని పేర్కొన్నారు. విజయవాడలో క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబుతో సమావేశం తరువాత ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. పార్టీ నేత రేవంత్ రెడ్డితో తనకెలాంటి గొడవలు లేవన్నారు. పట్టు నిలుపుకోవడానికి వరంగల్ లో పోటీ చేద్దామని చెప్పామని మరో టీటీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో చర్చిస్తానని బాబు చెప్పారన్నారు. టీడీపీ, బీజేపీ పరస్పరం సహకరించుకోవాలని బాబు సూచించారని తెలిపారు. నవంబర్ 7న హైదరాబాద్ లో జరిగే టీటీడీపీ సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారని రావుల తెలిపారు.