భారీ నిధితో బయటపడ్డ గ్రీకు వీరుడి సమాధి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భారీ నిధితో బయటపడ్డ గ్రీకు వీరుడి సమాధి

అతడు గ్రీస్ సైనికుడు. దాదాపు 3,500 ఏళ్ల క్రితం మరణించాడు. అంతకుమించిన మరే వివరాలూ తెలియవు. ఇప్పుడతని సమాధి బయటపడగా, అందులో భారీ నిధి కూడా లభించింది. ఏథెన్స్ సమీపంలోని పెలోపొన్నెస్ ప్రాంతంలో అమెరికా పురావస్తు పరిశోధకులు తవ్వకాలు జరపగా, ఈ నిధితో కూడిన సమాధి బయపడింది. బంగారు నగలు, నాణ్యమైన ముత్యాలు, వెండి ఖడ్గం, ఏనుగు దంతాలతో నగిషీలు చెక్కిన వస్తువులు ఈ సమాధిలో లభించాయి. మొత్తం 1400 వస్తువులు ఈ సమాధిలో దొరికాయని, క్రెట్ ద్వీపంలో దాదాపు 4 వేల ఏళ్ల క్రితం ఉన్నట్టుగా భావిస్తున్న నాగరికత ఆనవాళ్లు ఇవని ఆర్కియాలజిస్టులు వెల్లడించారు. గత ఆరున్నర దశాబ్దాల కాలంలో గ్రీస్ లో బయటపడ్డ అత్యంత ప్రాచీన మానవ అవశేషం ఇదేనని ఆ దేశ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

More Telugu News