రాజధాని అమరావతిని ఫ్రీజోన్ చేయాలి: మాజీ మంత్రి వెంకటేశ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాజధాని అమరావతిని ఫ్రీజోన్ చేయాలి: మాజీ మంత్రి వెంకటేశ్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఫ్రీ జోన్ చేయాలని మాజీ మంత్రి టీజీ వెంకటేశ్ డిమాండ్ చేశారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతిని ఫ్రీజోన్ చేయకపోతే రాయలసీమ వాసులకు తీవ్ర నష్టం జరిగే అవకాశముందని, ఇప్పటికే రాయలసీమ వాసులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. పట్టిసీమ, పోలవరంతో పాటు రాయలసీమలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. రాయలసీమకు నీళ్లందించే అన్ని ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టి పెట్టి యుద్ధప్రాతిపదికన వాటిని పూర్తి చేయాలన్నారు.

More Telugu News