మాది ఆసుపత్రి కాదు... దేవాలయం: బాలకృష్ణ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మాది ఆసుపత్రి కాదు... దేవాలయం: బాలకృష్ణ

నందమూరి బసవతారకం కేన్సర్ ఆసుపత్రిని ఓ దేవాలయంలా నిర్వహిస్తున్నామని, ఇక్కడికి వచ్చేవారు సైతం దీన్ని ఆసుపత్రిలా భావించడం లేదని సినీనటుడు బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం హైదరాబాదు, కేబీఆర్ పార్క్ లో కేన్సర్ పై అవగాహన కల్పించేందుకు పింక్ రిబ్బన్ వాక్ జరిగింది. ఈ కార్యక్రమంలో బాలకృష్ణతో పాటు గోపీచంద్, అంజలి, హేమ తదితరులు పాల్గొన్నారు. బాలయ్య ప్రసంగిస్తూ, 15 ఏళ్ల క్రితం 100 పడకలు, మూడు అంతస్తులతో ప్రారంభమైన ఆసుపత్రి, ఇప్పుడు 500 పడకలకు, బహుళ అంతస్తుల భవనాలకు విస్తరించిందని, తుది దశ కేన్సర్ రోగులు సైతం ఇక్కడి నుంచి పూర్తిగా చికిత్స పొంది ఇళ్లకు వెళ్లారని అన్నారు. ప్రతి ఒక్కరూ కేన్సర్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

More Telugu News