సిక్సర్ తో సెంచరీ కొట్టి, సత్తా తగ్గలేదని చాటిన యువరాజ్ సింగ్
భారత క్రికెట్ జట్టులో స్థానం కోల్పోయి, ప్రస్తుతం రంజీల్లో ఆడుతున్న స్టార్ బ్యాట్స్ మన్ యువరాజ్ సింగ్ తనలో ఇంకా సత్తా తగ్గలేదని చాటాడు. గ్రూప్-బి లీగ్ లో భాగంగా గుజరాత్, పంజాబ్ జట్ల మధ్య మొహాలీలో జరుగుతున్న మ్యాచ్ లో యువరాజ్ చెలరేగాడు. 151 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో సెంచరీ కొట్టాడు. తన సెంచరీని ఓ భారీ సిక్సర్ తో యువీ పూర్తి చేయడం విశేషం. యువరాజ్ మొత్తం 187 పరుగులు చేయడం, వోహ్రా 104 పరుగులతో రాణించడంతో పంజాబ్ జట్టు 608 పరుగులు చేసి పటిష్ఠ స్థితికి చేరుకుంది. ఈ మ్యాచ్ లో గుజరాత్ 467 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే.