Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కొండారెడ్డిపల్లిలో వైద్య శిబిరం ఏర్పాటు చేసిన ప్రకాశ్ రాజ్

తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా కేశంపేట మండలం కొండారెడ్డిపల్లిని సినీ నటుడు ప్రకాశ్ రాజ్ దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ గ్రామంలో ముందుగా ప్రజల ఆరోగ్యంపై ఆయన దృష్టి పెట్టారు. ఈ మేరకు అక్కడ ఓ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సన్ షైన్ ఆసుపత్రి వైద్య బృందం సహకారంతో గ్రామంలోని చిన్నారులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించినట్టు తన ఫేస్ బుక్ ఖాతాలో ప్రకాశ్ రాజ్ తెలిపారు. దానికి సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా ఆయన పోస్ట్ చేశారు.

More Telugu News