Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అంబేద్కర్ గౌరవార్థం పోస్టల్ స్టాంప్ విడుదల చేసిన కేంద్రం

భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పోస్టల్ స్టాంపులను విడుదల చేసింది. కేంద్ర సమాచార, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ స్మారక పోస్టల్ స్టాంపులను ఢిల్లీలో ఆవిష్కరించారు. అంబేద్కర్ గౌరవార్థం త్వరలో ఓ నాణెం కూడా ముద్రించనున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖ నుంచి మూడు రోజుల కిందటే సంబంధిత అనుమతి లభించిందని సామాజిక న్యాయ, సాధికారత మంత్రి తవార్ చంద్ గెహ్లట్ తెలిపారు.

More Telugu News