Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఢిల్లీలో సమస్యలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణం : సుప్రీంకోర్టు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగానే ఢిల్లీలో సమస్యలు తలెత్తుతున్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే, ఢిల్లీ ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఇక్కడ డెంగ్యూ మృతుల సంఖ్య పెరుగుతోందంటూ వేసిన పిల్ పై విచారణను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ‘కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర పాలన చూస్తున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, వీరిద్దరూ తమ మధ్య ఉన్న విభేదాలను పక్కనపెట్టి సమస్యలను పరిష్కరించుకోకపోతే ప్రజలు సరైన సమయంలో సరైన తీర్పును యిస్తారు. ఇటువంటి వివాదాల్లో కోర్టులు జోక్యం చేసుకోకూడదు. ఆ రెండు ప్రభుత్వాలు కలిసి కూర్చుని మాట్లాడుకోవాలి’ అని జస్టిస్ టిఎస్ థాకూర్, వి.గోపాలగౌడాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తుల ధర్మాసనం ఈ సూచన చేసింది.

More Telugu News