Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మంత్రి ఉమా రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేసిన కొత్తపల్లి

ఏపీ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెంటనే రాజీనామా చేయాలని వైకాపా నేత కొత్తపల్లి సుబ్బరాయుడు డిమాండ్ చేశారు. పోలవరం కుడికాల్వకు గండి పడిన ఘటనపై మండిపడ్డ ఆయన... దీనికి దేవినేని ఉమా బాధ్యత వహించాలని, తన పదవికి రిజైన్ చేయాలని అన్నారు. ఒక్క పంపుకే గండిపడితే, మొత్తం 12 పంపులు నిర్మించిన తర్వాత పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. నాణ్యత లేకుండా పనులు చేపడుతున్నారని ఆయన ఆరోపించారు. పట్టిసీమ ప్రాజెక్టులో అవినీతి భారీ ఎత్తున జరిగిందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని అన్నారు.

More Telugu News