Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మొదలైన టీఎస్పీఎస్సీ ఏఈఈ ఎగ్జామ్... తొలి పరీక్షకు బారులు తీరిన అభ్యర్థులు

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నిర్వహిస్తున్న తొలి పరీక్ష కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. సాగునీటి శాఖలో 931 ఏఈఈ పోస్టుల భర్తీ కోసం నిర్వహిస్తున్న ఈ పరీక్షకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు. హైదరాబాదుతో పాటు వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన 99 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష మొదలైంది. దేశంలోనే తొలిసారిగా ఉద్యోగ భర్తీకి ఉద్దేశించిన పరీక్షను టీఎస్పీఎస్సీ ఆన్ లైన్ లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన తొలి ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు అభ్యర్థుల నుంచి మంచి స్పందన లభించింది. దాదాపు హాల్ టికెట్లు జారీ అయిన 30,783 మంది అభ్యర్థుల్లో మెజారిటీ అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. మధ్యాహ్నం కూడా రెండో పేపర్ పరీక్ష జరగనుంది.

More Telugu News