37 ఏళ్ల సతీష్ విశాఖపట్నంలో శాంసంగ్ సంస్థలో పనిచేస్తున్నాడు. అతనికి తాళి కట్టిన భార్య, ఆరేళ్ల కుమార్తె ఉన్నారు. ఇంతలో ఎంబీఏ చదువుతున్న సింధూర (24) అతనికి పరిచయమైంది. వారి పరిచయం ప్రేమగా మారింది. ఈ ప్రేమ వ్యవహారం సతీష్ భార్య సంగీతకు తెలిసిపోయింది. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. భర్తపై మహిళా పోలీస్ స్టేషన్ లో కూడా సంగీత ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా కుటుంబ సభ్యులు, పెద్దమనుషుల సమక్షంలో కూడా ఈ విషయంపై చర్చలు జరిగాయి. ఆ తర్వాత భార్యాభర్తలు కలిసే ఉన్నారు. కానీ, సింధూరతో తన భర్త ప్రేమాయణం ఇంకా కొనసాగుతూనే ఉందన్న విషయం తెలియడంతో... ఇద్దరి మధ్య రెండు రోజుల క్రితం పెద్ద గొడవ జరిగింది. ఆ తర్వాత తన కుమార్తెను తీసుకుని అత్తగారింటికి వెళ్లిన సంగీత... తన బాధనంతా చెప్పుకుని రోదించింది.
మరోవైపు, కాలేజీకి పోతున్నానంటూ ఇంటి నుంచి బయటకు వచ్చిన సింధూర తన ప్రియుడు సతీష్ వద్దకు వచ్చింది. అనంతరం ఇద్దరూ కలసి ధర్మారం సమీపంలో ఆత్మహత్య చేసుకున్నారు. వీరిద్దరి మృత దేహాలు రైలు పట్టాలపై కనిపించాయి. ఘటనా స్థలంలో సతీష్ కు చెందిన బ్యాగును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న డైరీలో... "నీవు, నేను, సింధూర ముగ్గురం కలసి ఉందామన్నా మీరెవరూ ఒప్పుకోవడం లేదు. ఇద్దర్నీ బాగా చూసుకుంటానని చెబుతున్నా నమ్మడం లేదు. మా చావుకు ఎవరూ కారణం కాదు" అని సతీష్ రాసినట్టు పోలీసు అధికారి వెల్లడించారు. ఈ ఘటనతో ఇరు కుటుంబాలు తీవ్ర వేదనలో మునిగిపోయాయి. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
More Telugu News
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన
-
'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
-
ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!
-
సివిల్స్ కోచింగ్ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. ఆర్థిక సాయం పెంపు