విద్యుత్ ఉద్యోగుల సమస్యను సెప్టెంబర్ 3లోగా పరిష్కరించండి... కేంద్రానికి హైకోర్టు ఆదేశం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విద్యుత్ ఉద్యోగుల సమస్యను సెప్టెంబర్ 3లోగా పరిష్కరించండి... కేంద్రానికి హైకోర్టు ఆదేశం

స్థానికత ఆధారంగా తెలంగాణ జెన్ కో నుంచి రిలీవ్ చేసిన 1,253 మంది ఏపీ విద్యుత్ ఉద్యోగుల పిటిషన్ పై ఉమ్మడి హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. విద్యుత్ ఉద్యోగుల సమస్యలను సెప్టెంబర్ 3వ తేదీలోగా పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఇరు రాష్ట్రాల అధికారులను పిలిచి సమస్యను పరిష్కరించాలని చెప్పింది. కొన్ని నెలల నుంచి ఈ సమస్యపై ఉద్యోగులు పోరాడుతున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి స్పందన లేదు. దాంతో ఉద్యోగులు కోర్టుకు వెళ్లారు.

More Telugu News