ఉండవల్లి చేరుకున్న పవన్ కల్యాణ్...పంట పొలాలను పరిశీలించిన జనసేన అధినేత
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఉండవల్లి చేరుకున్న పవన్ కల్యాణ్...పంట పొలాలను పరిశీలించిన జనసేన అధినేత

జనసేన అధినేత, టాలీవుడ్ అగ్ర నటుడు పవన్ కల్యాణ్ కొద్దిసేపటి క్రితం నవ్యాంధ్ర రాజధాని పరిధిలోని ఉండవల్లి చేరుకున్నారు. నేటి ఉదయం 7 గంటలకు హైదరాబాదులోని తన ఇంటి నుంచి కారులో బయలుదేరిన పవన్ కల్యాణ్ రోడ్డు మార్గం మీదుగానే గుంటూరు జిల్లా చేరుకున్న సంగతి తెలిసిందే. మంగళగిరి సమీపంలోని హాయ్ ల్యాండ్ లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత పవన్ కల్యాణ్ అక్కడి నుంచి బయలుదేరి ఉండవల్లి చేరుకున్నారు. మార్గమధ్యంలో ఆయన ప్రభుత్వం సేకరించనున్న ఉండవల్లి భూములను పరిశీలించారు. మరికాసేపట్లో ఆయన పెనుమాక చేరుకోనున్నారు.

More Telugu News