రిషితేశ్వరి కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ పై ముగిసిన వాదనలు... తీర్పు వాయిదా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రిషితేశ్వరి కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ పై ముగిసిన వాదనలు... తీర్పు వాయిదా

నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి కేసులో నిందితులు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై గుంటూరు జిల్లా కోర్టులో వాదనలు ముగిశాయి. అయితే తీర్పును న్యాయమూర్తి ఈ నెల 10వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఈ కేసులో అరెస్టైన ముగ్గురు నిందితులు ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు. మరోవైపు రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ప్రిన్సిపాల్ బాబూరావుపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ విద్యార్థి జేఏసీ హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసింది.

More Telugu News