రాహుల్ ను రాజీవ్ గాంధీ అని సంబోధించి నాలుక కరుచుకున్న చిరంజీవి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాహుల్ ను రాజీవ్ గాంధీ అని సంబోధించి నాలుక కరుచుకున్న చిరంజీవి

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి నోరు జారారు. రాహుల్ గాంధీని రాజీవ్ గాంధీ అని సంబోధించి నాలుక కరుచుకున్నారు. వెంటనే సరిదిద్దుకుని తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ ఘటన సాక్షాత్తు రాహుల్ గాంధీ సమక్షంలోనే జరగడం విశేషం. అనంతపురం జిల్లాలో రాహుల్ పర్యటన సందర్భంగా, ఓబులదేవర చెరువులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ చిరంజీవి ఈ తత్తరపాటుకు గురయ్యారు. ఆ తర్వాత తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, రైతుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకే రాహుల్ గాంధీ వచ్చారని తెలిపారు. గతంలో తొమ్మిదేళ్ల టీడీపీ పాలనలో రైతులు కుదేలైపోయారని... ఆ తర్వాత కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత రైతులకు మంచి రోజులు వచ్చాయని చెప్పారు. మళ్లీ గత ఏడాది నుంచి రైతుల ఆత్మహత్యలు 35 శాతం పెరిగాయని తెలిపారు. రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు ఆ హామీని గాలికి వదిలేశారని ఆరోపించారు. రైతులకు రుణమాఫీ చేయకపోవడం టీడీపీకి సిగ్గు చేటని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేంతవరకు రాహుల్ నాయకత్వంలో అందరం పోరాడతామని చెప్పారు.

More Telugu News