ఇండియాలో అత్యధికుల ప్రాణాలను బలిగొంటున్నది ఏంటో తెలుసా? గుండెపోటో, క్యాన్సరో కాదు. రోడ్డు ప్రమాదాలు. నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ చేజేతులా తమ ప్రాణాలను, పక్కవారి ప్రాణాలను తీసేస్తున్న వారి కారణంగా 2014లో రోజుకు 16 మంది మృతి చెందారు. 2013తో పోలిస్తే గత సంవత్సరం 3 శాతం అధికంగా మొత్తం 1.41 లక్షల మంది రహదారి ప్రమాదాల్లో మరణించారు.
నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాల ప్రకారం ప్రమాదాల్లో గాయపడ్డవారి సంఖ్య సైతం 2013తో పోలిస్తే 4.5 లక్షల నుంచి 4.8 లక్షలకు పెరిగింది. మొత్తం ప్రమాదాల్లో ద్విచక్ర వాహనాలు, లారీల కారణంగానే సగం మందికి పైగా మృత్యువాత పడ్డారని, 13,787 మంది టూ వీలర్ లపై ప్రయాణిస్తూ మరణించగా, ట్రక్కులు, లారీలూ ఢీకొని 23,529 మంది మరణించారని, 1.4 లక్షల మంది మృత్యువుకు దగ్గరగా వెళ్లి వచ్చారని తెలిపింది. అతి వేగం, ముందు వెళ్తున్న వాహనాలను ఓవర్ టేక్ చేయడం కారణంగా 1.7 లక్షల యాక్సిడెంట్లు జరిగాయని, వాటిల్లో 49 వేల మంది మరణించారని తెలిపింది. యూపీ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాల్లో 40 శాతం వాహన ప్రమాదాలు జరిగాయని, మెట్రోల విషయానికి వస్తే ఢిల్లీ ముందు నిలిచిందని తెలిపింది.
More Telugu News
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ