రామకృష్ణ మృతికి తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం
టాలీవుడ్ ప్రముఖ గాయకుడు విస్సంరాజు రామకృష్ణ మృతికి తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు సంతాపం ప్రకటించారు. కొంతకాలంగా కేన్సర్ తో బాధపడుతున్న రామకృష్ణ నేటి తెల్లవారుజామున హైదరాబాదు, జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. పాత తరం చిత్రాల్లో ఘంటసాల తర్వాత ఆ స్థాయిలో నేపథ్యగాయకుడిగా రామకృష్ణ ఖ్యాతిగాంచారు. రామకృష్ణ మృతిపై కొద్దిసేపటి క్రితం కేసీఆర్ సంతాపం తెలిపారు. రామకృష్ణ కుటుంబానికి కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.