తన అక్రమ సంబంధం బయటపెట్టానని వేధిస్తున్నాడు!: ఐఏఎస్ పై భార్య ఫిర్యాదు
భర్త తనను వేధిస్తున్నాడంటూ ఒడిశా అదనపు చీఫ్ సెక్రటరీ భార్య ఆ రాష్ట్ర మహిళా కమిషన్ ను ఆశ్రయించింది. తన భర్తకు ఢిల్లీకి చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని, దానిపై నిలదీసినందుకు కక్ష పెంచుకున్న ఆయన, నిత్యం వేధిస్తున్నాడంటూ ఫిర్యాదులో పేర్కొంది. మానసిక వేధింపులకు గురిచేస్తున్న భర్త వల్ల తనకు ప్రాణహాని ఉందని ఆమె తెలిపింది. ఈ విషయంపై గతంలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను కలిసినా తనకు న్యాయం జరగలేదని ఆమె వెల్లడించింది. దీనిపై మహిళా కమిషన్ సదరు ఐఏఎస్ అధికారిని వివరణ అడగగా స్పందించేందుకు ఆయన నిరాకరించినట్టు సమాచారం.