త్వరలో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు అంటే ఏ రీతిలో ప్రచారం ఉంటుందో తెలిసిందే. ఓటర్లను ఆకట్టుకునేందుకు తెరవెనుక ప్రయత్నాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. స్థాయిని బట్టి తాయిలాలు అందిస్తారు. వార్డు స్థాయి నాయకుడికి ఓ రేటు, గ్రామస్థాయి నాయకుడికి మరో రేటు... ఇలా ప్రతి ఒక్కరికీ ఓ రేటు నిర్ణయించి ఓట్లు కొల్లగొట్టేందుకు పార్టీలు తీవ్రంగా శ్రమిస్తాయి. ఇప్పుడు బీహార్‌లోనూ అదే సీన్ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో వాతావరణం వేడెక్కింది.
కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలోకి రావడంతో పలు రాష్ట్రాల బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం పొంగిపొర్లుతోంది. ఈ క్రమంలో బీహార్ బీజేపీ విభాగం ఈసారి నితీశ్ కుమార్ కు చెక్ పెట్టాలని కృతనిశ్చయంతో ఉంది. అందుకే ఓటర్లను ఆకట్టుకునేందుకు స్థానిక కమలనాథులు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా, మహిళలను ఆకర్షించగలిగితే సగం పనయినట్టేని వారు నమ్ముతున్నారు. అందుకే 'మోదీ చీరలు' కాన్సెప్ట్ ను తీసుకువచ్చారు. పెద్ద ఎత్తున చీరలు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే 25 చీరల తయారీదారులకు స్పెషల్ ఆర్డర్లు అందినట్టు తెలిసింది. మొత్తం 10 లక్షల ప్యాకెట్లు అందించాలని నిర్ణయించారట. ఒక్కో ప్యాకెట్ పై మోదీ బొమ్మ, బీజేపీ స్లోగన్ ఉంటాయట. ఈ చీరల వ్యవహారం అంతా ఓ బీజేపీ ఎంపీ పర్యవేక్షిస్తున్నట్టు మీడియా చెబుతోంది. మరి వారి చీరల ఎత్తుగడ ఫలిస్తుందో లేదో చూడాలి!
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు