Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ట్యాపింగ్ పరికరాలను ఏపీ అడగలేదు... మీడియా కథనాలను ఖండించిన ‘ఆర్టస్’ సీఈఓ

ఓటుకు నోటు కేసు దరిమిలా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభేదాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ట్యాపింగ్ పరికరాలను సమకూర్చుకునేందుకు యత్నించిందన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదట. ఈ మేరకు ఏపీ ఇంటెలిజెన్స్ వర్గాలు సంప్రదించాయని భావిస్తున్న ‘ఆర్టస్’ కంపెనీ సీఈఓ ప్రభాకర్ కాసు ఈ వార్తలను ఖండిస్తూ ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ట్యాపింగ్ పరికరాల కొనుగోలుపై తమతో ఏపీ ప్రభుత్వం సంప్రదించిందన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం కాని, ఏపీ ఇంటెలిజెన్స్ వర్గాలు కాని తమతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని ఆయన తెలిపారు.

More Telugu News