మిత్రమా, నిన్ను మించిన విలన్ లేడు: రానాకు బాలీవుడ్ నటుడి కితాబు
'బాహుబలి' సినిమాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ లో ఇప్పటికే పేరుతెచ్చుకున్న రానాను అందరూ అభినందిస్తున్నారు. రానా అద్భుతంగా నటించాడని...రానాను మించిన విలన్ లేడని బాలీవుడ్ 'విలన్' సినిమా హీరో సిద్ధార్థ్ మల్ హోత్రా కితాబిచ్చాడు. 'బాహుబలి' యూనిట్ పడిన కష్టం ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపించిందని సిద్ పేర్కొన్నాడు. 'బాహుబలి' సినిమా అద్భుతమని మరింత మంది నటులు ట్వీట్లు చేయగా, నటుడు జాకీ భగ్నానీ ఈ రోజు 'బాహుబలి' రోజు అంటూ ట్వీట్ చేశారు. కాగా, డినోమోరియా, తుషార్ కపూర్, గౌరీ ఖాన్, సంజయ్ కపూర్ తదితరులు సినిమా చూసి అద్భుతమని ప్రశంసించారు.