అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునేందుకు వచ్చిన మహిళా తహశీల్దార్ పై అనుచరులతో కలిసి దాడి చేసిన టీడీపీ నేత, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రౌడీ షీటరట. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరుకు చెందిన ప్రభాకర్ ది ఆది నుంచి వివాదాస్పద వైఖరేనట. 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన చింతమనేని అంతకుముందు తన సొంత మండలం పెదవేగికి ఎంపీపీగా పనిచేశారు.
2009లో అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆయన ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పార్టీ నేతలతో అంటిపెట్టుకుని తిరుగుతూ పలు విమర్శలకు తెరలేపిన వ్యక్తిగా పేరుంది. ఏలూరులోని పోలీస్ స్టేషన్లలో ఆయనపై నమోదైన 14 కేసులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. పట్టణంలోని ఓ పోలీస్ స్టేషన్ లో ఆయనపై పోలీసులు రౌడీ షీట్ తెరిచారు. ఆది నుంచి పలు వివాదాల్లో చిక్కుకున్న ఆయన మొన్నటి ఎన్నికల్లో దెందులూరు నుంచి విజయం సాధించారు. అయితే ఆయన వ్యవహార సరళిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, ఇకముందైనా బుద్ధిగా మసలుకోవాలని సూచించి విప్ పదవిని కట్టబెట్టారు. అయితే చింతమనేని వ్యవహారంలో ఎలాంటి మార్పు రాలేదట.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు