Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘బాహుబలి’ థియేటర్ వద్ద ఉద్రిక్తత...మహబూబాబాద్ లో యువకుల రాళ్లదాడి, పోలీసులకు గాయాలు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా టాలీవుడ్ సంచలన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం ‘బాహుబలి’ని చూసేందుకు జనం ఎగబడుతున్నారు. నేటి ఉదయం ప్రపంచవ్యాప్తంగా 4 వేలకు పైగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రదర్శితమవుతున్న అన్ని థియేటర్ల వద్ద భారీ జన సందోహం నెలకొంది. టికెట్ల కోసం అభిమానులు ఎగబడుతున్నారు. ఈ క్రమంలో వరంగల్ జిల్లా మహబూబాబాద్ లో ‘బాహుబలి’ థియేటర్ వద్ద తోపులాట చోటుచేసుకుంది. టికెట్ల కోసం ఒక్కసారిగా ప్రేక్షకులు చొచ్చుకురావడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. తమను నిలువరించే క్రమంలో లాఠీలకు పనిచెప్పిన పోలీసులపై ప్రేక్షకులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి.

More Telugu News